ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మరోసారి చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ

international |  Suryaa Desk  | Published : Thu, Jan 02, 2025, 02:00 PM

మరోసారి చైనా వైరస్‌ల బారిన చిక్కుకుని విలవిలలాడుతుంది. పలు రకాల వైరస్‌ల వ్యాప్తితో చైనా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల పాలవుతుండటంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చైనాలో మల్టిపుల్ వైరస్‌ల మూకుమ్మడి వ్యాప్తి నేపధ్యంలో ఆ దేశంతో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించారు. కోవిడ్-19తో పాటు ఇన్‌ఫ్లుయెంజా-A, HMPV, మైకోప్లాస్మా న్యూమోనియా వంటి వైరస్‌లు చైనాలో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్నాయి.వైరస్ ల బారిన పడిన పేషెంట్లతో ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. మరోసారి దేశంలో వైరస్ కారక మరణాలు పెద్ద సంఖ్యలో సాగుతున్నాయని తెలుస్తోంది. హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించిన చైనా ప్రభుత్వం వైరస్‌ల వ్యాప్తిని అరికట్టేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. అక్కడి అధికార యంత్రాంగం వైరస్ ల నివారణ కోసమే అప్రకటిత యుద్ధమే చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com