ఆకస్మాత్తుగా ‘ఎమర్జెన్సీ మార్షల్ లా’ విధించి వెనక్కి తీసుకున్నా దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై తాజాగా న్యాయస్థానం అరెస్టు వారెంట్ జారీ చేసింది. దీంతో ఆయనపై విచారణ కొనసాగుతుంది.
ఈ పరిణామాల నేపథ్యంలో సియోల్‌లోని యూన్ నివాసం ఎదుట ఆయన మద్దతదారులు మోహరించారు. తనకు వ్యతిరేకంగా పని చేస్తున్న శక్తులపై చివరి వరకు పోరాడుతానని యూన్ ప్రసంగించారు.