మనం ఇచ్చే సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందాల్సిందే అని సీఎం చంద్రబాబు మంత్రివర్గ సమావేశంలో అన్నారు. ఆర్టీసీ బస్‌లో ఉచిత ప్రయాణంపై మంత్రుల అభిప్రాయాలను ముఖ్యమంత్రి అడిగిన తెలుసుకున్నారు. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం ముందు అమలు జరుపాలని ఆయన కోరారు. ఫీజు రీ ఇంబర్సెంట్ కొంత విడుదల చేయాలని.. విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా ఎవరూ ఆపవద్ధని వెంటనే కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని సీఎస్‌కు కేబినెట్ చెప్పింది. ఈ విషయాన్ని కళాశాలల యాజమాన్యాలకు వెంటనే చెప్పాలని చంద్రబాబు ఆదేశించారు. రెవిన్యూ సదస్సులు వలన ఎన్ని దరఖాస్తులు వచ్చాయని.. ఎన్ని పరిష్కారం అయ్యాయని సీఎం ప్రశ్నించగా.. రెవెన్యూ సదస్సుల్లో ఇప్పటివరకు 13వేల కు పైగా దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. సమస్యల కోసం అర్జీదారులు పదే పదే రాకూడదన్నారు. ఒకే సమస్యపై పదే పదే తిరగకుండా ఎంత త్వరగా పరీష్కారం చూపామన్నదే కీలకం కావాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు వెల్లడించారు.