లయోలా కళాశాల గ్రౌండ్‌లో అందరికీ వాకింగ్‌కు అనుమతి ఇచ్చేవరకు నిరసన తెలుపుతామని వాకర్స్ స్పష్టం చేశారు. ఆంధ్రా లయోలా కళాశాల యాజమాన్యం వైఖరిని వ్యతిరేకిస్తూ కళాశాల గ్రౌండ్‌లో వాకింగ్‌కు అనుమతిని కోరుతూ లయోలా , అమరావతి వాకర్స్ ఆధ్వర్యంలో చేపట్టిన నిరసన కార్యక్రమం గురువారంతో 16వ రోజుకు చేరుకుంది. నగర పొలీస్ కమీషనర్ ఎస్వీ రాజశేఖరబాబు ఆదేశాల మేరకు సాయంత్రం లయోలా వాకర్స్, కళాశాల యాజమాన్యంతో చర్చలు జరిపారు. అనంతరం వాకర్స్ మాట్లాడుతూ ఈ చర్చలో కళాశాల యాజమాన్యం ప్రభుత్వం ఇచ్చిన జీవో ఎంఎస్ ఎన్‌ఓ 18 ప్రకారం వాకింగ్‌కు అందరినీ అనుమతించాలి. దీనికి విరుద్ధంగా యాజమ్యానం సీనియర్ సిటిజన్స్‌ను లేదా 50 నుంచి 100 మంది వాకర్స్‌కు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చారని తెలిపారు. వీటిని తాము అంగీకరించమన్నారు. శుక్రవారం ఉదయం జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ సమస్యను వివరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయోలా, అమరావతి వాకర్స్ పాల్గొన్నారు.