మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు సాహితీ వేత్తగా, రచయితగా మహోన్నతులు అని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనియాడారు. పీవీ నరసింహారావు జీవిత చరిత్ర పుస్తకం ఆవిష్కరించడం ఆనందంగా ఉందని అన్నారు. పీవీ గురించి మాట్లాడే అంత జ్ఞానం తనకు లేదని చెప్పారు. తనకు అంత జ్ఞానం వచ్చాక మాట్లాడతానని అన్నారు. తనకు ఈ అవకాశం ఇచ్చిన ఆంధ్రజ్యోతి కృష్ణారావుకు ధన్యవాదాలు తెలిపారు. పీవీ తన గ్రంధాలయం తీసుకుని ఏపీకి వద్దామనుకున్న సమయంలో ప్రధాని అయ్యారని గుర్తుచేశారు. ఢిల్లీలో పీవీకి సరిగ్గా ఖనన కార్యక్రమం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పీవీకి నివాళి అర్పించడానికి ఢిల్లీలో సమాధి లేదని వాపోయారు. లక్షల మంది ముందుకు వచ్చి ఢిల్లీలో స్మృతి వనం ఏర్పాటు చేసేలా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. వనవాసి, అక్షర సత్యామృతం, ఏది పాపం, నానీపాల్కే వూది పీపుల్ ఇలా ఎన్నో పుస్తకాలు తాను చదివిన వాటిలో ఉన్నాయని తెలిపారు. .ఇక నుంచి తన ట్విట్టర్‌లో అప్పుడప్పుడు పుస్తకాలపై పోస్ట్ పెడతానని పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. ఓజి ఓజి అంటూ అభిమానుల నినాదాలు చేశారు. ఈ సందర్భంగా అభిమానులు ఓజి అనే కన్నా శ్రీశ్రీ అంటే బాగుంటుందని పవన్ కల్యాణ్ చమత్కరించారు.