కనిగిరి మండలంలోని చిన్న ఇర్లపాడు గ్రామంలో మిని గోకులంను కనిగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, డ్వామా పీడీ జోసెఫ్ అదివారం ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే ఉగ్ర మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని అన్నారు. స్వయం శక్తితో ఎదిగే వారికీ ప్రభుత్వం అండగా ఉంటుందని రుణాలు అందజేస్తామని అన్నారు.