ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలంలో ఆదివారం స్వామి వివేకానంద 162వ జయంతి, 41వ జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకుని ఆయన విగ్రహానికి స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆత్మ విశ్వాసాన్ని, పరమాత్మ విశ్వాసాన్ని శక్తి శరాలుగా ఎంచి మానవ జాతి మనుగడకు దిశానిర్దేశం చేసిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు.