మార్కాపురం మండలం దారిమడుగులో ఆదివారం ఉపాధి హామీ పథకం కింద నిర్మించిన మినీ గోకుల ఆవుల షెడ్డును స్థానిక ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే నారాయణరెడ్డి మాట్లాడుతూ.. పాడి రైతులను దృష్టిలో ఉంచుకొని కూటమి ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టినట్లు చెప్పారు. భవిష్యత్తులో కూడా రైతులకు మరిన్ని పథకాలు కూటమి ప్రభుత్వం అందిస్తుందన్నారు.