ఒంగోలు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రతి సోమవారం జరిగే మీకోసం కార్యక్రమం రద్దు చేసినట్లుగా ఎస్పీ దామోదర్ ఆదివారం తెలిపారు. ఈనెల 13న భోగి పండుగ కావడంతో మీకోసం కార్యక్రమం రద్దు అయినట్లుగా ఎస్పీ వెల్లడించారు.
ఈ విషయాన్ని ప్రజలు గమనించి ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి ఎవరు రావద్దని ఎస్పీ దామోదర్ ప్రజలను కోరారు. ఇప్పటికే స్థానిక అధికారులకు ఈ విషయంపై స్పష్టత ఇవ్వడం జరిగిందన్నారు.