వైయస్ఆర్ సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ బుట్టా రేణుక ఆదేశాల మేరకు ఎమ్మిగనూరు మునిసిపాలిటీ పట్టణ అధ్యక్షులు నాగేశప్ప ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని స్వామి వివేకానంద జయంతిని ఘనంగా నిర్వహించారు. పలువురు మాట్లాడుతూ స్వామి వివేకానంద జీవిత స్ఫూర్తి యువతకు మార్గదర్శకమని, ఆయన చారిత్రక చికాగోలో ప్రసంగం ద్వారా భారత ఆధ్యాత్మికతను విశ్వవ్యాప్తంగా చాటిచెప్పిన గొప్పతనాన్ని గుర్తు చేశారు.