అన్నక్యాంటీన్లలో ఫుడ్ బాగుందని.. పని తీరు కాస్త మెరుగుపరుచుకోవాలని మంత్రి నారాయణ అన్నారు. అన్న క్యాంటిన్ మొదలుపెట్టిన రోజు ఉన్న క్వాలిటి, క్వాంటిటీని ఈరోజుకు మెయింటైయిన్ చేస్తున్నారని అన్నారు. టైమింగ్స్ విషయంలో ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. ఏజెన్సీ నిర్వాహకులు, డైరెక్టర్ ఆఫ్ మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్‌కు సూచనలిచ్చానని అన్నారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటును అత్యంత బృహత్తర కార్యక్రమంగా చేపట్టామని తెలిపారు. గత వైసిపీ ప్రభుత్వ ఐదేళ్ల పాలనలో టీడీపీ మీద కోపంతో అన్న క్యాంటీన్లను మూసేసి లక్షల మంది పొట్టకొట్టిందని చెప్పారు. జగన్ పిచ్చి చేష్టలతోనే 11 సీట్లకు ప్రజలు పరిమితి చేశారని అన్నారు. 175 నియోజకవర్గాల్లో కనీసం ఒక్కటైన అన్న క్యాంటీన్ ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మంత్రి నారాయణ పేర్కొన్నారు.