తమ గూడెంలో తాగునీటి సమస్యను పరిష్క రించాలని చెంచుగిరిజన మహిళలు ఆదివారం ఖాళీ బిందెలతో రోడ్డుపై ఆందోళన వ్యక్తం చేశారు. పెద్దదోర్నాల మండలంలోని బయన్నగూడెంలో పది రోజులుగా నీటికి ఇబ్బందులు తలెత్తు తుండడంతో చెంచు గిరిజన మహిళలు చిన్న దోర్నాల వద్ద దోర్నాల-మార్కాపురం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో ఒక బోరుబావి ఉందని అయితే అందులో మోటారు పడిపోయిందన్నారు. నీళ్లు కూడా అడుగంటడంతో పంచాయతీ అధికారులు పట్టించుకోలేదన్నారు. ఈ క్రమంలో ఆర్‌డీటీ సంస్థ ఆధ్వర్యంలో కొన్ని రోజులు ట్యాంకరుతో నీటిని సరఫరా చేశారన్నారు. ఇప్పుడు వాళ్లు కూడా నిలిపి వేయడంతో వ్యవసాయ మోటార్ల వద్ద తెచ్చుకుంటూ కాలం గడుపుతు న్నట్లు తెలిపారు. అయితే ప్రస్తుతం పంటలకు నీరు సరిపోవడం లేదని రైతులు కూడా నీరు ఇవ్వడం లేదన్నారు. దీంతో నీటికి కష్టాలు పడుతున్నామన్నారు. తాగునీటి సమస్య పరిష్కరించాలంటూ నినాదాలు చేశా రు. గ్రామస్థుల ఆందోళనతో వాహనాల రాకపోకలు స్తంభించాయి. దీంతో ప్రయాణి కులు పోలీసుస్టేషనుకు పిర్యాధు చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్సై మహేష్ గిరిజనులతో మాట్లాడి విషయం తెలుసుకొని పంచాయతీ అధికారులతో చర్చించారు. రేపటి నుంచి నీటిని అందిస్తామని హామీ ఇవ్వడంతో గిరిజనులు ఆందోళన విరమించారు. దీంతో వాహనాల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.