కేరళ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. వయనాడ్‌లో గతేడాది వరదలు బీభత్సం సృష్టించాయి. అకాల వర్షాల కారణంగా 263 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
కొండచరియలు విరిగిపడిన ఘటనలో గల్లంతైన వారిని మృతులుగా ప్రకటించాలని నిర్ణయించింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో విపత్తులో గల్లంతైన వారి కుటుంబ సభ్యులకు లబ్ధి చేకూరుతుందని, పరిహారం అందించేందుకు సహాయపడుతుందని పేర్కొంది.