ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ పథకాల అమలు, పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణ పనులు, పేదలకు భూమి పంపిణీ వంటి అంశాలపై ప్రధానంగా చర్చించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ మంత్రివర్గ సమావేశంలో.. తల్లికి వందనం పథకం అమలు విషయంపై సీరియస్ డిస్కషన్ నడిచింది. వచ్చే విద్యా సంవత్సరం నాటికి తల్లికి వందనం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం డబ్బులు వేసిన వెంటనే.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ వేయాలని నిర్ణయించారు. ఇక పోలవరం డయాఫ్రామ్ వాల్‌ను వెంటనే ప్రారంభించామని నిర్ణయించారు. రాధాజాని అమరావతి పనులు కూడా వెంటనే ప్రారంభమవుతానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కేబినెట్ భేటీలో చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లు స్థలం పేదలకు ఇచ్చేందుకు వెంటనే ఏర్పాట్లు చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.