వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో పాల్గొనేందుకు దావోస్‌కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పయనమయ్యారు. గన్నవరం విమానాశ్రయం చేరుకున్న చంద్రబాబు మరికాసేపట్లో ఢిల్లీ విమానం ఎక్కనున్నారు. దేశ రాజధానికి చేరుకున్న అనంతరం రాత్రి 1:30 గంటలకు జ్యూరిచ్‌కు బయలుదేరుతారు. సోమవారం ఉదయం జ్యూరిచ్‌కు చేరుకుని బిజినెస్ దిగ్గజాలతో సీఎం చంద్రబాబు సమావేశం అవుతారు. అనంతరం హయత్ హోటల్‌లో తెలుగు పారిశ్రామిక వేత్తలతో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రోడ్డుమార్గంలో జ్యూరిచ్ నుంచి దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సుకు వెళ్తారు.