ప్రతీ గ్రామానికి పక్కా రోడ్డు నిర్మాణమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వరరావు (ఎన్‌ఈఆర్) అన్నా రు. సోమవారం ఆయన జి.సిగడాం, మండలంలో సుడిగాలి పర్యటన చేసి పలు అభివృద్ధి పనులకు శంకుస్ధాపన చేశారు. సంతవురిటి నుంచి విజయరాంపురం, సంతవురిటి నుం చి సీతారాంపురం, టీడీ వలస నుంచి నక్కపేట గ్రామాలకు వెళ్లే బీటీ రహదారి నిర్మాణాలకు ఆయన భూమిపూజ చేశారు. కూ టమి నాయకులు కుమరాపు రవికుమార్, బాలబొమ్మ వెంకటేశ్వ రరావు, పైల విష్ణుమూర్తి, మీసాల రవికుమార్, సంతవురిటి సర్పంచ్ బుడారి లక్ష్మణరావు, సీతంపేట సర్పంచ్ గేదెల మల్లిబా బు, దవళపేట సర్పంచ్ వడిశ మహేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక ఆదర్శ పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే సర్పంచ్ ముద్దాడ గౌరీశ్వరరావును ఎమ్మెల్యే ఎన్‌ఈఆర్ పరామరించారు. గౌరీశ్వరరావు తల్లి ముద్డాడ డొంకమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ కుటుంబానికి సానుభూతి తెలిపారు.