విశ్రాంత ఉపకులపతి డా.రాజేష్ కుమార్ సింగ్ డాకారే నేతృత్వంలో విశ్రాంత ప్రొఫెసర్ డా.ప్రియం, పీకే డా. రాజేష్‌లతానేలతో కూడిన ‘న్యాక్’ త్రిసభ్య కమిటీ బందృం బుధవారం కళాశాలను సందర్శించింది. ముందుగా కళాశాల స్థలదాత దివంగత జవ్వాజి సుంకన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. తమ సందర్శనకు చిహ్నంగా కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటి వివిధ విభాగాధిపతులతో ముఖాముఖిలో భాగంగా వివిధ విభాగాల ప్రాశస్థ్యాన్ని తాఖీదు చేశారు. అనంతరం కళాశాల పూర్వ విద్యార్థులు, విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశమై అంచనా వేస్తూ కళాశాల పురోగమన చర్యల గురించి చర్చించారు. అనంతరం కళాశాల విద్యార్థులతో భేటీ అయి కళాశాలలో బోధనా విధానాలపై చర్చించారు. బోధనేతర సిబ్బందితో భేటీ నిర్వహించారు. విద్యారుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. గురువారం కూడా ‘న్యాక్’ బృందం పర్యటిస్తుందని కళాశాల ప్రిన్సిపాల్ సునీత తెలిపారు.