విద్యార్థుల్లో శాస్తీయ ఆలోచనలు రేకెత్తించడం ద్వారా వారిని సమాజంలో ఉన్నతంగా తీర్చిదిద్దవచ్చని ఎపి జెన్‌కో (హైదరాబాద్) విశ్రాంత ఇంజనీర్ డాక్టర్ ఎస్.వి.ఎం.భువనైకరావు అన్నారు. అంతర్జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పాతబస్తీలోని మద్ది సుబ్బారావు ఆంగ్ల మాద్యమం పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎపిజె అబ్ధుల్ కలాం సైన్స్ లాబోరేటరీస్‌ను ఆయన గురువారం ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలుత డాక్టర్ సీవీ రామన్ చిత్రపటానికి పాఠశాల పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మన దేశానికి విజ్ఞాన శాస్త్రంలో మొట్టమొదటి నోబెల్ బహుమతి సాధించిపెట్టిన గొప్ప ఆవిష్కరణ జరిగిన రోజు అని తెలిపారు. 1928 ఫిబ్రవరి 28న సీవీ రామన్ రామన్ ఎఫెక్ట్ కనుగొని భవిష్యత్‌తరాలకు ఎంతో మేలు చేశారని పేర్కొన్నారు. ఆయన కార్యదక్షతను నేటి తరం విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఈ సందర్భంగా లాబోరేటరీలో విద్యార్థులు రూపొందించిన ప్రదర్శనలు ఆలోజింపజేశాయి. కార్యక్రమంలో కేబీఎన్ కళాశాల కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు వంకదారు హేమచంద్రరావు, తూనుగుంట్ల శ్రీనివాస్, ఎం.ఎస్.ఆర్.స్కూల్ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు వంకదారు వాసుదేవరావు, కొత్త నాగేశ్వరరావు, కోశాధికారి సీహెచ్ అమర్ సుధీర్, పాఠశాల ప్రధానోపాధ్యాయిని పి.శ్యామల, ప్రత్యేక అధికారి జె.నాగేశ్వరరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa