ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్ కూల్చివేసిన పాక్ యుద్ధ విమాన శకలాలివే

national |  Suryaa Desk  | Published : Thu, Feb 28, 2019, 09:00 PM

LOC దాటి భారత భూభాగంలోకి చొరబడిన పాక్ యుద్ధ విమానం ఎఫ్-16ని భారత్  కూల్చివేసిన విషయం తెలిసిందే. గురువారం ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ చీఫ్‌లు(త్రివిధ దళాధిపతులు) నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ఎఫ్-16 విమాన శకలాలను దేశ ప్రజలకు చూపించారు.LOC దగ్గర నిరంతర నిఘా కొనసాగుతుందని త్రివిధ దళాధిపతులు ప్రకటించారు. పాక్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు దిగితే ధీటుగా బదులిస్తామని హెచ్చరించారు. ఉగ్రవాదులను భారత్ పైకి పాక్ ఉసిగొల్పుతున్నంత కాలం ఉగ్రశిబిరాలపై దాడులు చేస్తామని స్పష్టం చేశారు.భారత్ చేయాలనుకున్నది, టార్గెట్ లను నాశనం చేయాలనుకున్నది, చేసిన దానికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని, సీనియర్ల సలహా మేరకే కూల్చివేయబడిన పాక్ విమాన శకలాలను దేశ ప్రజలకు చూపించడం జరిగిందని వారు తెలిపారు.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa