ఉగ్రవాదంపై యుద్ధం కొనసాగుతుందని భారత త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ ముఖ్య అధికారులు ఢిల్లీలో సమావేశం అయ్యారు. ఉమ్మడి ప్రకటనను జారీ చేశారు. ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్, నేవీ రియల్ అడ్మిరల్ డీఎస్ గుజ్రాల్, మేజర్ జనరల్ సురేంద్ర సింగ్ మహల్ కలసి సంయుక్త ప్రకటన చేశారు. పాకిస్థాన్ ఏమేం అబద్ధాలు చెప్పిందో బయటపెట్టారు. సరిహద్దుల్లో భారత ఐఏఎఫ్ పూర్తి అప్రమత్తంగా ఉందని ఎయిర్ వైస్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్ స్పష్టం చేశారు. వింగ్ కమాండర్ అభినందన్‌ను పంపిస్తామని పాక్ ప్రకటించిందని.. ఆ విషయంపై ఐఏఎఫ్ హ్యాపీగా ఉందని చెప్పారు. పాకిస్థాన్ పలు అబద్ధాలు ప్రచారంచేసిందని త్రివిధ దళాలు స్పష్టం చేశాయి. మొదట రెండు విమానాలు కూల్చామని, ముగ్గురు పైలెట్లు చనిపోయాని చెప్పిన పాకిస్థాన్.. ఆ తర్వాత రెండు విమానాలు, ఇద్దరు పైలెట్లు అని చెప్పిందన్నారు. కానీ, రాత్రికి మళ్లీ మాట మార్చిందని.. ఒక పైలెట్‌ను మాత్రమే పట్టుకున్నట్టు అంగీకరించిందన్నారు.
ప్రజలు లేని ప్రాంతంలో బాంబులు వేశామని పాక్ చెప్పిందని, కానీ వారి టార్గెట్ మిలటరీ స్థావరాలనే విషయం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఎఫ్ 16 విమానాలను వాడలేదని పాక్ చెప్పిందని.. అయితే, ఎఫ్ 16 విమానం కూలిన విషయం స్పష్టంగా కనిపిస్తోందని ఎయిర్ వైస్ మార్షల్ ఆర్జీకే కపూర్ తెలిపారు. ఎఫ్ 16ను కూల్చినప్పుడు కొన్ని భాగాలు భారత భూభాగంలో పడ్డాయన్న ఆర్జీకే కపూర్.. ఆ ఆధారాలను మీడియాకు చూపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa