ట్రెండింగ్
Epaper    English    தமிழ்

షెడ్యూలు రాగానే అభ్యర్థుల ప్రకటన: జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 28, 2019, 09:54 PM

ఎన్నికల షెడ్యూలు వెలువడిన ఒకటి రోజుల్లో అభ్యర్థుల ప్రకటన ఉంటుందని వైసీపీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌ అన్నారు. షెడ్యూల్‌ విడుదలైన వెంటనే బస్సు యాత్ర మొదలవుతుందన్నారు. సమర్థత ఉన్నవారికి ఎన్నికల ఇన్‌ఛార్జీలుగా బాధ్యత అప్పగిస్తున్నాను. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల ఎన్నికల ఇన్‌ఛార్జిల సమావేశంలో జగన్‌ మాట్లాడారు. పార్టీ గెలుపులో మీరు పోషించే పాత్ర కీలకంగా ఉంటుంది. ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులకు చేదోడు వాదోడుగా నిలవండన్నారు. వారిని గెలిపించడమే మీ బాధ్యత, గెలపును మీ భుజస్కందాలపై వేసుకోండని చెప్పారు. వచ్చే 45 రోజుల కాలం అత్యంత కీలకం. 9 ఏళ్లుగా పోరాటాలు చేశారు, ఈ 45 రోజులు కూడా అదే స్ఫూర్తితో పనిచేయాలని కోరారు. ఈ 45 రోజులు త్యాగాలు చేయండి, కలిసివచ్చే ప్రతి ఒక్కరినీ కలుపుకుపోవాలి. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవస్థలు బతకాలంటే పార్టీ గెలుపు ఒక్కటే మార్గమన్నారు. ఈ సమావేశంలో ప్రశాంత్‌ కిశోర్, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, , పిల్లి సుభాష్‌చంద్ర బోస్, విజయ సాయిరెడ్డి పాల్గొన్నారు.


 


 


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa