ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక కుంభమేళాలో విషాదం చోటుచేసుకుంది. మౌని అమావాస్య సందర్భంగా నెలకొన్న రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగి పలువురు ప్రాణాలు కోల్పోయారు.ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. బాధితులకు అందుతున్న వైద్య సాయంపై ఆరా తీసినట్లు ప్రధాని వెల్లడించారు.
''ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన బాధాకరం. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా'' - రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము
''ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళా లో చోటుచేసుకున్న విషాదం తీవ్ర విచారకరం. ఈ ఘటనతో తమ ప్రియమైన వారిని కోల్పోయిన భక్తులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్నివిధాలా సాయం చేస్తోంది. దీని గురించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోనూ మాట్లాడా. రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నా'' - ప్రధాని మోదీ
'ఆ చెత్త డబ్బాలు కన్పించక పోవడంతో'.. కుంభమేళా తొక్కిసలాట ఘటనపై ప్రత్యక్ష సాక్షులు మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానాల కోసం భక్తులు పోటెత్తారు. ఈక్రమంలోనే బుధవారం తెల్లవారుజామున రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. బారికేడ్లు విరగడంతో తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ ఘటనలో కనీసం 20 మంది మృతిచెందినట్లు పలు మీడియా కథనాలు చెబుతున్నాయి. అయితే, యూపీ సర్కారు మాత్రం మృతుల సంఖ్యపై అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.