AP: జలవనరుల శాఖలో ఇంజినీరింగ్ అధికారుల పదోన్నతులకు సంబంధించి అడ్డంకులన్నీ తొలగిపోయాయి. సీనియారిటీ విషయంలో ఇంజినీరింగ్ అధికారుల మధ్య వివాదాలు తలెత్తి న్యాయ పోరాటాలు చేస్తున్న తరుణంలో, వారి మధ్య సఖ్యతను పెంచేలా మంత్రి నిమ్మల రామానాయుడు చొరవ చూపడంతో సమస్యకు పరిష్కారం లభించింది. విజయవాడ క్యాంపు కార్యాలయంలో జలవనరుల శాఖ అధికారులతో నిన్న మంత్రి నిమ్మల ఈ సమస్యపై సమీక్ష నిర్వహించారు.