ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి డయల్‌ యువర్‌ ఈవో ఇలా..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2019, 05:13 PM

తిరుమలలోని అన్నమయ్య భవనంలో శుక్రవారం డయల్‌ యువర్‌ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో పలువురు భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానాలు ఇచ్చారు.



1. డా.శంకరన్‌  - కాంచీపురం, తమిళనాడు, ఏలుమలై - పిచ్చాటూరు.
ప్రశ్న: వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో ఒక్కొక్క కంపార్ట్‌మెంట్‌ను పది నిమిషాల తేడాతో విడుదల చేయండి?
ఈవో : శ్రీవారి ఆలయంలో భక్తులు సౌకర్యవంతంగా స్వామివారిని దర్శించుకునేందుకు రెండు కంపార్ట్‌మెంట్లను కలిపి ఒక్కసారి విడుదల చేయాల్సి ఉంది. 

2.. శ్రీధర్‌  - చీరాల.
ప్రశ్న: నేను శ్రీవారి సేవకు వస్తుంటాను. కంపార్ట్‌మెంట్లలో ఖచ్చితమైన దర్శన సమయాన్ని తెలియజేయండి. టివీలలో వీడియోతోపాటు ఆడియో వినిపించేలా చర్యలు తీసుకోండి, యాక్సెస్‌ కార్డుల గురించి భక్తులకు తెలియజేయండి, భక్తులు ఎండకు, వర్షానికి, చలికి ఇబ్బంది పడకుండా నారాయణగిరి ఉద్యానవనాలలో కాంప్లెక్స్‌ నిర్మించండి?
ఈవో : కంపార్ట్‌మెంట్లలో మరింత ఖచ్చితమైన శ్రీవారి దర్శన సమయాన్ని తెలిపేందుకు చర్యలు చేపట్టాం. టివీలలో వీడియోతోపాటు ఆడియో వినిపిస్తాం. యాక్సెక్‌ కార్డుల గురించి భక్తులకు తెలియజేస్తాం. నారాయణగిరి ఉద్యానవనాలలో కాంప్సెక్స్‌ నిర్మించే ప్రతిపాదన ఉంది. ఇందుకోసం ప్రణాళికలు రూపొందిస్తున్నాం. 


3. పద్మావతి - చెన్నై.
ప్రశ్న: తిరుమలలో పూలు అన్ని శ్రీవారికే అంటున్నారు. అలాంటప్పుడు పూల విక్రయాన్ని అరికట్టండి?
ఈవో : తగిన చర్యలు చేపడుతాం. 


4. పార్థసారధి - చెన్నై.
ప్రశ్న: శ్రీవారి ఆర్జిత సేవలను 50 శాతం ఆన్‌లైన్‌లో, 50 శాతం ఆఫ్‌లైన్‌లో విడుదల చేయండి?
ఈవో : శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు తక్కువగా ఉన్నాయి. ఎక్కువమంది భక్తుల కోరిక మేరకు ఆన్‌లైన్‌ డిప్‌ విధానాన్ని కొనసాగిస్తున్నాం. 


5. షర్మిల - చెన్నై.
ప్రశ్న: డిఫెన్స్‌ కోటాలో సుపథం ద్వారా దర్శనానికి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది దురుసుగా మాట్లాడారు, ఆ తర్వాత సర్వదర్శనానికి వెళ్లగా 9 గంటల సమయం పట్టింది. కల్యాణోత్సవం తరహాలో శ్రీవారి సుప్రభాత సేవకు కూడా తల్లిదండ్రులతోపాటు పిల్లలను అనుమతించండి. ?
ఈవో : భక్తుల పట్ల మర్యాదగా నడుచుకునేలా సిబ్బందికి తగిన సూచనలు ఇస్తాం. స్థలా భావం కారణంగా సుప్రభాత సేవకు పిల్లలను అనుమతించడం సాధ్యం కాదు.   


6. ఉమాశంకర్‌ - హైదరాబాద్‌
ప్రశ్న: రథసప్తమి ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ఇదే తరహాలో శ్రీవారి బ్రహ్మూెత్సవాలకు కూడా గ్యాలరీలలో షెడ్లను ఏర్పాటు చేయండి?
ఈవో : తప్పకుండా ఏర్పాటు చేస్తాం. 


7. శ్రీనివాసులు - ధర్మవరం.
ప్రశ్న: టైంస్లాట్‌ దర్శన విధానం బావుంది, పీఏసీ 4లో లాకర్లను ఏర్పాటు చేయండి, వసతి సముదాయాలలో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండేలా చూడండి?
ఈవో : పీఏసీ 4లో ఇప్పటికే లాకర్లను ఏర్పాటు చేశాం. తిరుమలలో ఆధునిక వసతులతో మరుగుదొడ్లను నిర్మిస్తున్నాం. వసతి సముదాయాలలో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉంచుతాం. భక్తులకోసం పీఏసీ నిర్మాణం జరుగుతోంది. 


8. రాధాకృష్ణన్‌ - వేలూరు
ప్రశ్న: గతంలో సమాచార కేంద్రాల వద్ద ఆర్జిత సేవాటికెట్లు ఇచ్చేవారు, ప్రస్తుతం నిలిపేశారు?
ఈవో : అన్ని ప్రాంతాలలోని భక్తులకు ఆర్జిత సేవా టికెట్లను అందుబాటులో ఉంచేందుకు ఆన్‌లైన్‌లో ప్రవేశపెడుతున్నాం. 


9. అశ్వని  - బెంగుళూరు
ప్రశ్న: మేల్‌ఛాట్‌ వస్త్రం ఎలా పొందాలి ?
ఈవో : తిరుమలలో ఎలక్ట్రానిక్‌ డిప్‌ ద్వారా మాత్రమే మేల్‌ ఛాట్‌ వస్త్రం టికెట్లు కేటాయిస్తున్నాం.


ఈ కార్యక్రమంలో టిటిడి తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీబి.లక్ష్మీకాంతం, సివిఎస్‌వో శ్రీ గోపినాథ్‌జెట్టి, శ్వేత సంచాలకులు శ్రీ ఎన్‌.ముక్తేశ్వరరావు, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ శ్రీ వేంకటేశ్వర్లు, డిఎఫ్‌వో శ్రీ ఫణికుమార్‌ నాయుడు, అన్నప్రసాదం ప్రత్యేకాధికారి శ్రీ వేణుగోపాల్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa