ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నిరంతర ప్రక్రియగా ఓట్ల నమోదు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2019, 07:52 PM

జిల్లాలోని  ఓటర్లందరికి ఓటు నమోదు, వినియోగం విషయంలో జిల్లా అధికార యంత్రాంగం శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని  జిల్లా రెవిన్యూ  అధికారి వెంకట సుబ్బయ్య స్పష్టం  చేశారు. జిల్లా పరిశ్రమల కేంద్రం ఆద్వర్యంలో శుక్రవారం ఉదయం ప్రకాశం భవనంలోని  సిపిఓ. సమావేశమందిరంలో నిర్వహించిన పారిశ్రామిక వేత్తలు,  కార్మికుల అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిధి గా పాల్గొని మాట్లాడారు.  ఈ సందర్భంగా జిల్లా రెవిన్యూ అధికారి మాట్లాడుతూ ఓటరు నమోదు విషయం పై అవసరమైన  అన్ని చర్యలు ఏర్పాట్లు సరుగుతున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ అంశానికి సంబంధించి దశలవారీగా  నిర్వహించిన కార్యక్రమాల గురించి వెంకట సుబ్బయ్య వివరించారు.  గ్రామీణ ప్రాంతంలో ప్రతి 1200 ఓటరుకు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 1400 ఓటర్లుకు  ఒక పోలింగ్  కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన వివారించారు.  ఓటు నమోదు నిరంతర ప్రక్రియ గా సాగుతుందని ఆయన తెలిపారు.


 


అభ్యర్ధులు తమ నామినేషన్లు సమర్పించే చివరి తేదీ వరకు ప్రతి  వయోజనుడు తమ ఓటు హక్కును ఆన్ లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చునని వివరించారు. ఓటు హక్కు కలిగిన వారందరు తప్పనిసరిగా సద్వినియోగపరచుకోవాలని సూచించారు.  కార్యక్రమానికి పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్  గోపాల్ అధ్యక్షత  వహించి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్ధలో ప్రతి ఓటరు తన ఓటును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పారిశ్రామిక వేత్తలు తమవద్ద పనిచేసే కార్మికులకు అవగాహన కల్పించాలన్నారు. దేశం పారిశ్రామిక, సామాజికాభివృద్ధికి ఓటరు చైతన్యం ఎంతగానో తోడ్పడుతుందని ఆయన వివరించారు.  ప్రతి పౌరుడు ఓటు హక్కును కాపాడుకోవాలని కోరారు. సర్వశిక్షా అభియాన్ ప్రాజెక్టు అధికారి వెంకటేశ్వరరావు పారదర్శక ఓటు విధానం గురించి వివరించారు. ఈ సందర్భంగా పలువురితో మోడల్ ఓటింగ్ ను నిర్వహించారు. ఓటు వేసిన 7సెకన్లలోపు ఓటరు తాను ఎవరికి ఓటు వేసింది వి.వి.ప్యాట్ ద్వారా తెలుసుకోవడం ఈ విధానం ప్రత్యేకత అని వెంకటేశ్వరరావు వివరించారు.


ఈ సమావేశంలో డిక్కి ప్రతినిది భక్తవత్సలం, మార్టూరు గ్రానైట్ అసోసియోషన్ ప్రతినిధి ఆంజనేయులు మాట్లాడుతూ ఓటు  హక్కు  ఓటు వేసే విధానంగా పై పారిశ్రామికులకు అవగాహన కల్పించగలమని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్ధులు, ఓటర్లు తమ సందేహాలను అధికారుల అడిగి  నివృత్తి చేసుకున్నారు. సమావేశంలో పారిశ్రామికవేత్తలు, కార్మికులు, విద్యార్ధులు తదితరులు  పాల్గొన్నారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa