ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొనసాగుతున్న పాకిస్తాన్ కవ్వింపులు

international |  Suryaa Desk  | Published : Fri, Mar 01, 2019, 08:01 PM

భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఓ వైపు ఉగ్రవాదుల చొరబాట్లు, మరోవైపు పాక్ సైన్యం కవ్వింపులతో భారత సైన్యం నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. జమ్మూకశ్మీర్‌లోని కుప్వారా జిల్లా హంద్వారాలో ఓ ఇంట్లో కొందరు ఉగ్రవాదులు నక్కారన్న పక్కా సమాచారంతో మన సైనికులు ఈరోజు అక్కడకు చేరుకున్నారు. ఉగ్రవాదులు తలదాచుకున్న ఇంటిని చుట్టుముట్టి లొంగిపోవాలని ఆదేశించారు. ఉగ్రవాదులు సైనికులపై కాల్పులు జరపడంతో వారు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబా సంస్థకు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు హతమయ్యారు. ఇంట్లో మరికొంత మంది ఉన్నట్లు తెలియడంతో వారి కోసం గాలిస్తున్నారు. కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. మరోవైపు సరిహద్దుల వెంబడి పాక్ సైన్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మన సైనికులపై కాల్పులకు తెగబడుతోంది. పాక్ కాల్పులకు మన సైన్యం ధీటుగా బదులిస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa