గత వైసీపీ ప్రభుత్వంలో బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా బాధ్యతలు నిర్వహించిన ఐఆర్‌టీఎస్ అధికారి డి.వాసుదేవరెడ్డి డిప్యుటేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు సీఎస్ కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రైల్వే శాఖ నుంచి డిప్యుటేషన్‌పై రాష్ట్రానికి వచ్చిన ఆయన గత వైసీపీ ప్రభుత్వంలో కీలక శాఖల్లో పనిచేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆయనను కార్పొరేషన్ ఎండీ పోస్టు నుంచి తొలగించింది. ఆయనపై కేసు నమోదు కావడంతో పోస్టింగ్ ఇవ్వలేదు. గతేడాది ఆగస్టు 25కి ఆయన డిప్యుటేషన్ గడువు ముగిసింది. ఆయనపై కేసులు నమోదు కావడంతో రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేయకుండా డిప్యుటేషన్ గడువును మరో ఆరు నెలలు పొడిగించింది. ఈ ఏడాది ఫిబ్రవరి వరకూ ఏపీలోనే కొనసాగనున్నారు.