మహా కుంభమేళాకు వెళ్లాలనుకునే భక్తుల కోసం మరో 6 ప్రత్యేకరైళ్లను నడపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వేప్రకటించింది. ఇందులో ఒక ప్రత్యేక రైలు ఫిబ్రవరి 14న బీదర్ నుంచి దానాపూర్‌కు, తిరుగు ప్రయాణంలో మరో ప్రత్యేకరైలు ఫిబ్రవరి 16న దానాపూర్ నుంచి చర్లపల్లికి నడపనున్నారు. అలాగే, చర్లపల్లి నుంచి దానాపూర్‌కు ఫిబ్రవరి 18, 22 తేదీల్లో మరో రెండు రైళ్లు తిరుగు ప్రయాణంలో దానాపూర్ నుంచి చర్లపల్లికి ఫిబ్రవరి 20, 24తేదీల్లో మరో రెండు ప్రత్యేకరైళ్లు రానున్నాయి.