ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 01, 2025, 01:37 PM

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. శనివారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ఆమె ప్రసంగాన్ని ప్రారంభించారు. పలు రంగాలకు కేటాయింపుల గురించి మాట్లాడుతున్నారు. ఈ బడ్జెట్‌లో ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేస్తున్నట్టు ప్రకటించారు.ఆరోగ్య రంగానికి సంబంధించి ఈ బడ్జెట్లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి జిల్లాలోనూ కేన్సర్ కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 200 జిల్లా కేంద్రాలలో కేన్సర్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. అలాగే పీఎమ్ జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కూడా కల్పిస్తున్నట్టు ప్రకటించారు. ఈ పథకం ద్వారా కోటి మంది గిగ్ వర్కర్లు ప్రయోజనం చేకూరబోతోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com