విశాఖ జిల్లా, పెందుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో వేపగుంట మచ్చమాంబ కాలనీకి చెందిన ముగ్గురు చిన్నారులు అదృశ్యమయ్యారు. రెండు కుటుంబాలకు చెందిన ఆదిత్య సాహూ (9), లక్ష్మీ సాహూ (7), గొర్లి గంగోత్రి (9) శుక్రవారం సాయంత్రం నుంచి వారు కనిపించడం లేదు. దీంతో వారి కుటుంబ సభ్యులు పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రెండు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సిఉంది.