మహారాష్ట్ర లోని నాసిక్-గుజరాత్ హైవేపై ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో 15 మంది గాయపడ్డారు.ఆదివారం ఉదయం 4:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ప్రాథమిక సమాచారం ప్రకారం ఓ లగ్జరీ బస్సు అనుకోకుండా 200 అడుగుల లోతైన గుంతలో పడిపోయింది. దీంతో బస్సులో ప్రయాణించిన వారిలో పలువురు మృతి చెందగా, మరి కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోందినాసిక్‌లోని సపుతర ఘాట్ ప్రాంతం నుంచి సూరత్ వైపు వెళ్ళే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బస్సు ఓ పహిడి మార్గంలో ప్రయాణించగానే ఆ ప్రమాదం చోటుచేసుకుంది. బస్సు అనుకోకుండా నియంత్రణ కోల్పోయి 200 అడుగుల లోతు గుంతలో పడిపోయింది. ఈ ప్రమాద ప్రయాణికులలో ఎక్కువ మంది మధ్యప్రదేశ్‌కు చెందినవారుగా తెలుస్తోంది. వారు నాసిక్‌లోని తీర్థయాత్ర ప్రాంతాలను సందర్శించడానికి వెళ్లారని సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు
సమాచారం ప్రకారం గాయపడిన ప్రయాణికులను పోలీసులు సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా బస్సుకు తీవ్ర నష్టం జరిగింది. దీంతో పాటు అనేక మంది ప్రయాణికులకు తీవ్రమైన గాయాలయ్యాయి. ఈ క్రమంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ప్రమాదం జరిగిన స్థలంలో అధికారులు వేగంగా స్పందించారు. వారి యాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు.దీంతోపాటు డ్రైవర్ నిద్ర మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల ప్రమాదం జరిగిందా లేదా మద్యం మత్తులో యాక్సిడెంట్ చేశాడా అనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పోలీసులు ఆ ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు నివారించడానికి చర్యలు తీసుకునే అంశాలపై యత్నిస్తున్నారు. ప్రమాదాలు ఎలా నివారించవచ్చనే విషయాలను దృష్టిలో ఉంచుకుని అడ్వైజరీ చర్యలు చేపట్టేందుకు పోలీసులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.