అధికార తెలుగు దేశం పార్టీ అన్ని విధాల ఓడిపోయిందని వైయస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు. నెల్లూరు కార్పోరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికలో టీడీపీ సొంత అభ్యర్థిని నిలబెట్టుకోలేక చేతులు ఎత్తేసింది. వైయస్ఆర్‌సీపీకి రాజీనామా చేయకుండా.. టీడీపీలో ఉన్న వారిపై అనర్హత వేటు తప్పదు. టీడీపీకి సపోర్ట్ చేసిన కార్పొరేటర్లలో ఏ ఒక్కరికీ రాజకీయ భవిష్యత్తు ఉండదు. నెల్లూరు కార్పోరేషన్‌లో ఎవరు గెలిచారో కూడా ఎన్నికల అధికారి చెప్పలేదు. పార్టీ ఫిరాయింపుదారులను ప్రజా క్షేత్రంలో దోషులుగా నిలబెడతామని చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు.