తిరుపతి డిప్యూటీ మేయర్, మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అరాచకాలకు పాల్పడింది అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నిన్ననే మేము ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేశాం. కానీ, పోలీసులు పూర్తిగా అధికార పార్టీకి రక్షణ కవచంగా మారారు. పోలీసుల సమక్షంలోనే కార్పొరేటర్లపై దాడి చేసి ఎత్తుకుని వెళ్లారు. టెంపుల్ సిటీలో ఇలాంటి అరాచకానికి దిగడం దారుణం. నూజివీడులో మంత్రి పార్థసారథి ఎనిమిది మంది కౌన్సిలర్లను లాక్కున్నారు. ఎందుకు అధికార పార్టీ ఇంతగా భయపడుతోంది. ఈ ప్రభుత్వం వైఎస్ జగన్‌ను చూస్తే వణికిపోతోంది. అందుకే ఇలాంటి దౌర్జన్యాలు చేస్తున్నారు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా ఇలాంటి దమన కాండే జరుగుతుంది. ఈ అరాచకాలపై పోరాటం చేస్తాం` అని మల్లాది విష్ణు తెలిపారు.