నారా లోకేశ్ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్న సమయంలో విద్యార్థుల సమస్యలు పరిష్కరిస్తామని, ఫీజు రీఎంబర్స్‌మెంట్, వసతి దీవెన కల్పిస్తామని హామీనిచ్చారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ ఉన్నారని, ఆయన ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని ఎంఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జెన్నే చిరంజీవి డిమాండ్ చేశారు. ప్రస్తుతం విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్‌మెంట్, వసతి దీవెన బకాయిలు పెండిరగ్‌లో ఉండటం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, విద్యకు దూరం కావాల్సిన దుస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల కోసం వైయస్ఆర్‌సీపీ తలపెట్టిన ఫీజు పోరుకు మద్దతు తెలుపుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎంఎస్‌ఎఫ్ నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొనాలని పిలుపునిచ్చారు.