కోవూరు నియోజకవర్గం, బుచ్చిరెడ్డిపాలెం నగర పాలక వైస్ చైర్మన్ ఎన్నికలో అధికారం పార్టీ ప్రలోభాలతో గెలిచినా, చివరికి నైతిక విజయం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచి, విప్ ధిక్కరించిన వారందరూ అనర్హులవుతారని స్పష్టం చేశారు. బుచ్చిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, కోవూరు నియోజకవర్గ ఇన్‌చార్జీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డితో కలిసి కాకాణి గోవర్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.... బుచ్చిరెడ్డిపాలెం నగర పాలక వైస్ చైర్మన్ ఉపఎన్నికల్లో పార్టీ సూచించిన వారికి ఓట్లు వేయని వారందరూ వెన్నుపోటు దారులుగా మిగిలిపోయారు.ఫ్యాన్ గుర్తు మీద గెలిచిన వారికి టీడీపీ వైస్ చైర్మన్ పదవులు ఇచ్చింది.మంత్రి నారాయణకు ఫిరాయింపు చట్టాల మీద అవగాహన లేదు..పార్టీ గుర్తుపై గెలిచి, విప్ ధిక్కరించిన వారందరూ అనర్హులు అవుతారు..
వైయస్ఆర్‌సీపీకి అండగా నిలిచిన వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు.ఎవరికో పుట్టిన బిడ్డను తెచ్చుకుని.. తమ బిడ్డగా టీడీపీ చెప్పుకోవడం సిగ్గుచేటు.టీడీపీ, తమ పార్టీలో గెలిచిన వారిని ప్రక్కన బెట్టి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన వారినే పోటీలో దించారు.ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో.. కోవూరులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాం.వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై, సానుభూతిపరులపై టిడిపి దాడులను అడ్డుకుంటాం.మేము రోడ్డెక్కి ప్రతిదాడులు చేస్తే.. జిల్లా అగ్నిగుండం అవుతుంది.. మా కార్యకర్తల జోలికి రావొద్దు..క్యాష్ కోసం, పేమెంట్స్ కోసం కౌన్సిలర్లు టీడీపీ వైపు వెళ్లారు.. నిఖార్సైన కార్యకర్తలు మా వెంట నిలబడ్డారు.ఓటమి పాలవుతామని తెలిసినా, పార్టీ ఆదేశాల ప్రకారం పోటీలో దిగిన వైయస్ఆర్‌సీపీ కౌన్సిలర్ల ధైర్యాన్ని కొనియాడాలి.తెలుగుదేశం పార్టీ చివరకు తెలుగుదేశం బీఫారం ఇవ్వలేక, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లో గెలిచిన వారిని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో నిలబెట్టడం దౌర్భాగ్యం.టిడిపి బలపరచి గెలిపించుకున్న వారిని తమ పార్టీ తరఫున ప్రకటించుకోలేని దీన స్థితిలో ఉంది.కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన వారికి అండగా ఉంటాం, భవిష్యత్తులో వారికీ పార్టీలో సముచిత స్థానాన్ని కల్పిస్తాం.అధికారం, ప్రలోభాలతో టిడిపి బలపరచిన అభ్యర్థులు గెలిచినా, చివరికి నైతిక విజయం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే అంటూ కాకాణి గోవర్ధన్‌రెడ్డి పేర్కొన్నారు.