తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యానికి పాతరేసింది అని వైసీపీనేతలు ఆరోపిస్తున్నారు. వారు మాట్లాడుతూ... మున్సిపాలిటీల్లో మెజారిటీ లేకపోయినాసరే అధికార దుర్వినియోగంతో గద్దెనెక్కాలని దౌర్జన్యాలు, దాడులతో టీడీపీ దిగజారుడు రాజకీయాలకు తెరతీసింది. డిప్యూటీ మేయర్ ఉప ఎన్నిక సందర్భంగా సోమవారం తిరుపతి నగరం రణరంగంగా మారిన సంగతి తెలిసిందే. బెదిరింపులు, దాడులు, కిడ్నాప్‌ల మధ్య కోరం లేక ఎన్నిక నేటికి( మంగళవారం) వాయిదా పడింది. కూటమి నాయకులకు ఎలాంటి మెజారిటీ లేకపోవడంతో కుట్రలకు పాల్పడుతున్నారు. ఎక్స్ అఫిషియో హోదాలో తిరుపతి ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యం వైయస్ఆర్‌సీపీ తరపున ఓటు హక్కు వినియోగించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రమణ్యంను టీడీపీ నేతలు.. అర్థరాత్రి కిడ్నాప్ చేశారు. ఈ విషయంపై పోలీసులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు.