ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ ఎన్నికలను సీరియస్ గా తీసుకోవాలని పిలుపుఎన్నికల హామీలన్నింటినీ కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని ఏపీ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని కూడా త్వరలోనే అమల్లోకి తెస్తామని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డీఎస్సీని అమలు చేస్తామని చెప్పారు. వచ్చే విద్యా సంవత్సరం నాటికి పరీక్షలు నిర్వహించి జాయినింగ్ లెటర్స్ ఇస్తామని తెలిపారు. భీమవరంలో కూటమి నేతలతో గొట్టిపాటి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారితో చర్చించారు. ఎన్నికలను ప్రతి ఒక్కరు సీరియస్ గా తీసుకోవాలని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించాలని సూచించారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ చేస్తున్న విష ప్రచారాన్ని తిప్పికొట్టాలని అన్నారు. ఎన్నికల ప్రచారానికి సోషల్ మీడియాను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని సూచించారు. పట్టభద్రుల ఎన్నికలు అందరూ బాధ్యతగా తీసుకోవాలని చెప్పారు.