తిరుపతి డిప్యూటీ మేయర్ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటు వేసి తప్పు చేశామని నలుగురు వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లు మాజీ మంత్రి, భూమన కరుణాకర్‌రెడ్డి కాళ్ల మీద పడి క్షమాపణలు కోరారు. డిప్యూటీ మేయర్ ఎన్నిక అనంతరం భూమన కరుణాకర్‌రెడ్డి నివాసానికి టీడీపీకి ఓటేసిన నలుగురు వైయస్ఆర్‌సీపీ కార్పొరేటర్లు వచ్చారు. బెదిరించి కూటమికి ఓట్లు వేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు అయిందంటూ భూమన కాళ్లమీద పడి క్షమాపణ కోరారు. కూటమి నేతలు తమను కొట్టి బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నలుగురు కార్పొరేటర్లు మీడియాతో మాట్లాడుతూ.. `పశ్చాత్తాపంతో తమను క్షమించమని వేడుకుంటూ భూమన కరుణాకరరెడ్డిని మేం నలుగురం (కార్పొరేటర్లు) అనీష్, అనిల్, మోహన్ కృష్ణ యాదవ్, అమరనాథ్ రెడ్డిలు ప్రాధేయపడ్డాం. తామంతా వైయస్ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం కోరుకునే వాళ్ళమని, మమ్మల్ని భయపెట్టి, ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేస్తామని బెదిరించి కిడ్నాప్ చేశారు. వాళ్ళకి భయపడి ఓటు వేయాల్సి వచ్చింది, తప్పు జరిగి పోయింది క్షమించమని కరుణాకర్ రెడ్డిని వేడుకుంటున్నాం` ఎత్తుకెళ్లి మాపై భౌతికంగా దాడి చేసి, ఇబ్బందులు పెట్టారు. ఓటు వేయకుంటే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు..భయపెట్టారు` అని కార్పొరేటర్లు అనీష్ రాయల్ , అనిల్, మోహన్ కృష్ణ యాదవ్ మీడియా ఎదుట వాపోయారు.