రథసప్తమి సందర్భంగా తిరుచానూరులో మంగళవారం ఉదయం సూర్యనారాయణ స్వామికి జరిగిన అశ్వవాహన సేవలో బెదిరిన గజరాజు ఘీంకరించింది. దీంతో భక్తులు ఆందోళన చెందారు. అమ్మవారి పుష్కరణిలో భక్తులు స్నానాలు ఆచరించాక దుస్తులు మార్చుకునేందుకు ఆలయం వెనుక తాత్కాలిక షెడ్లు వేశారు. వీటి చుట్టూ బ్లూరంగులో పరదా కట్టారు. అదే సమయంలో సూర్యనారాయణస్వామికి అశ్వవాహనసేవ సందర్భంగా గంగుండ్రమండపం వద్దకు వచ్చిన గజరాజు(శ్రీనిధి) ఆ షెడ్లకు చుట్టిన పరదా రంగును చూసి బెదిరింది. ఘీంకారం చేసింది. దీంతో భక్తులు, ఆలయాధికారులు ఆందోళన చెందారు. మావటిలు గజరాజును పక్కకు తీసుకెళ్లి సముదాయించారు.
ఆ తర్వాత వాహన సేవల్లో యథావిధిగా గజరాజు పాల్గొంది.తిరుచానూరు, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): రథసప్తమి సందర్భంగా తిరుచానూరులో మంగళవారం ఉదయం సూర్యనారాయణ స్వామికి జరిగిన అశ్వవాహన సేవలో బెదిరిన గజరాజు ఘీంకరించింది. దీంతో భక్తులు ఆందోళన చెందారు. అమ్మవారి పుష్కరణిలో భక్తులు స్నానాలు ఆచరించాక దుస్తులు మార్చుకునేందుకు ఆలయం వెనుక తాత్కాలిక షెడ్లు వేశారు. వీటి చుట్టూ బ్లూరంగులో పరదా కట్టారు. అదే సమయంలో సూర్యనారాయణస్వామికి అశ్వవాహనసేవ సందర్భంగా గంగుండ్రమండపం వద్దకు వచ్చిన గజరాజు(శ్రీనిధి) ఆ షెడ్లకు చుట్టిన పరదా రంగును చూసి బెదిరింది. ఘీంకారం చేసింది. దీంతో భక్తులు, ఆలయాధికారులు ఆందోళన చెందారు. మావటిలు గజరాజును పక్కకు తీసుకెళ్లి సముదాయించారు. ఆ తర్వాత వాహన సేవల్లో యథావిధిగా గజరాజు పాల్గొంది.