టీటీడీ సోషల్ మీడియాలో మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వీడియో రావడాన్ని ప్రస్తుత బోర్డు సభ్యులు తీవ్రంగా పరిగణించారు. రథసప్తమికి సంబంధించి పాత వీడియోలు సేకరించే క్రమంలో గత ప్రభుత్వంలోని బోర్డు చైర్మన్ వీడియోను సేకరించి సోషల్ మీడియాలో ప్రదర్శించారు. దీన్ని గుర్తించిన ప్రస్తుత బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఆర్వో విభాగానికి సమాచారం ఇవ్వడంతో పాటు చైర్మన్ బీఆర్ నాయుడి దృష్టికి తీసుకెళ్లారు. దీనికి కారణమైన ఓ ఉద్యోగిని ఇప్పటికే విధులను తప్పించినట్టు సమాచారం. రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.