భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ యువతిపై ఆటో డ్రైవర్ అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆటో ఎక్కిన యువతిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అఘాత్యానికి ఒడిగట్టే ప్రయత్నం చేశాడు. మరో వ్యక్తితో కలిసి దారుణానికి పాల్పడ్డాడు. వారి చెర నుంచి తప్పించుకున్న యువతి విషయాన్ని బంధువులకు చెప్పింది. దీంతో సినీఫక్కీలో నిందితుడిని వారు పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం జిల్లా కరకగూడెం గ్రామానికి చెందిన ఓ యువతి కొత్తగూడెం రామా టాకీస్ ప్రాంతాంలోని తమ బంధువల ఇంటికి వెళ్లేందుకు శనివారం కొత్తగూడెం బస్టాండ్‌కు వచ్చింది. యువతికి సరిగ్గా మాటలు రావు. దీంతో ఆమె చెప్పే అడ్రస్ ఆటో డ్రైవర్ గుగులోత్ కుమార్‌కు అర్థం కాలేదు. పక్కనే ఉన్న మరో డ్రైవర్ యువతి దగ్గర ఉన్న సెల్ నంబర్‌కు ఫోన్ చేసి అడ్రస్ కనుక్కున్నాడు. అనంతరం కుమార్‌కు అడ్రస్ చెప్పాడు. యువతి ఆటోలో ఎక్కగా.. అందులో అప్పటికే మరో వ్యక్తి ఉన్నాడు. అయితే ఆమె చెప్పిన అడ్రస్‌కు కాకుండా డ్రైవర్ కుమార్ హేమచంద్రాపురం రోడ్డులోని రైల్వే గేట్ పక్కన గల అటవీ ప్రాంతంలోకి ఆమెను తీసుకెళ్లాడు.
అది గమనించిన యువతి.. ఎక్కడికి తీసుకెళ్తున్నారని సైగలతో డ్రైవర్‌ను నిలదీసింది. ఈ క్రమంలోనే ఆటో డ్రైవర్ కుమార్ , మరో వ్యక్తి ఆమెపై అత్యాచారానికి యత్నించారు. వారి చెర నుంచి తప్పించుకున్న యువతి.. రైల్వే గేట్ వైపు పరుగులు తీసింది. అక్కడ ఉన్న ఉద్యోగికి సైగలతో విషయం చెప్పింది. యువతి వద్ద ఉన్న నంబర్‌కు ఫోన్ చేసిన రైల్వే ఉద్యోగి జరగిన విషయం చెప్పారు. అక్కడకు చేరుకున్న యువతి బంధువులు.. జరిగిన విషయంపై ఆరా తీశారు.
బస్టాండ్ ప్రాంతంలోని సీసీ కెమెరాలను పరిశీలించి ఆటోడ్రైవర్‌ను గుర్తించారు. అంతకు ముందు అడ్రస్ కోసం కాల్ చేసిన ఆటో డ్రైవర్ ద్వారా కుమార్ అడ్రస్ కనుకున్నారు. పట్టణంలోని సూపర్‌బజార్ నుంచి మెయిన్ హాస్పిటల్ వెళ్లే మార్గంలో ఆటో డ్రైవర్‌ను గుర్తించారు. వీరిని చూసిన కుమార్ పారిపోయే ప్రయత్నం చేశాడు. ఈ క్రంమలో రెండు కార్లు, మరో ఆటోను ఢీకొట్టాడు. అయినా పట్టు వదలకుండా సినీఫక్కీలో అతడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.
![]() |
![]() |