ఉమ్మడి అనంతపురం జిల్లా, అమరాపురంమండలంలోని హేమావతి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ సుజల స్రవంతి తాగునీటి బోరును, సీసీ రోడ్డు, గోకులంషెడ్డులను ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యులు ఎం.ఎ్‌స.రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం యువతను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు గోకులం షెడ్లను రాయితీతో ఇస్తోందని వారు తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్ శ్రీనివాసమూర్తి, ఎంపీడీఓ రామారావు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ మనూనాయక్, ఏఈ హరీష్, మండల కన్వీనర్ గణేష్, ఎస్సీ సెల్ జయకుమార్, మాజీ జడ్పీటీసీ నరసింహమూర్తి, రామచంద్రప్ప, కుమారస్వామి, మారుతీప్రసాద్, శివరుద్రప్ప, సర్పంచి తిప్పేస్వామి, జడ్పీటీసీ స్వారక్క, దాదాపీర్ పాల్గొన్నారు.
![]() |
![]() |