త్రివేణి సంగమంలో భక్తుల పుణ్యస్నానాలు. ఇప్పటివరకు దాదాపు 44 కోట్ల మంది భక్తుల పుణ్యస్నానాలు. ప్రయాగ్‌రాజ్ వెళ్లే మార్గాల్లో వాహనాల రద్దీ. జబల్‌పుర్-ప్రయాగ్‌రాజ్ మార్గంలో నిలిచిన వాహనాలు. కాశీ, అయోధ్యలకు పోటెత్తుతున్న భక్తులు. ఈ నెల 26తో ముగియనున్న మహా కుంభమేళా.రోజూ లక్షలాది మంది భక్తులు తరలివస్తుండటంతో ప్రయాగ్‌రాజ్‌కు దారితీసే అన్ని దారులు ట్రాఫిక్ జామ్‌తో స్తంభించిపోయాయి. 100 నుంచి 300 కి.మీ వరకు వాహనాలు బారులు తీరాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 200 కి.మీ దూరం నుంచి ప్రయాగ్‌రాజ్ రావడానికి తమకు 16 గంటలు పట్టిందని ఒక కుటుంబం వాపోయింది. నడక దారులు కూడా కిక్కిరిసిపోవడంతో 4 కి.మీ దూరానికి నాలుగు గంటలు పడుతున్నదని పలువురు భక్తులు వాపోతున్నారు. తాము అనుకున్న సమయానికి చేరలేక, గంగా, యమున, సరస్వతి సంగమంలో పుణ్య స్నానాలు చేయలేకపోతున్నామంటూ తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు.
![]() |
![]() |