కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కడప నగరంలో కక్షపూరిత రాజకీయాలకు తెరలేచింది అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారు మాట్లాడుతూ.... వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా ఈ దాడులు,దౌర్జన్యాలు సాగుతున్నాయి. ప్రజలకు శుద్ధి చేసిన నీటిని అందించాలన్న లక్ష్యంలో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్‌టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా ఎంపీ నిధులు, ఏపీఎండీసీ నిధులను వెచ్చించి నగరంలో సుమారు 10 వాటర్‌ప్లాంట్లు నిర్మించారు. వాటి ద్వారా పేదలు నివాసం ఉన్నచోట రూ.5లకే క్యాన్ శుద్ధి చేసిన నీటిని అందించేవారు. కాలానుగుణంగా అందులో కొన్ని ప్లాంట్లు మూతబడ్డాయి. మరికొన్ని కొనసాగుతున్నాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక వాటి పేరు వైయస్ఆర్ ప్యూరిఫైడ్ వాటర్‌ప్లాంట్లుగా మార్చారే తప్పా మూసివేయించలేదు. వీటివల్ల పేదలకు సురక్షిత నీరు అందుతుండటమే ఇందుకు కారణంగా చెబుతున్నారు అని మండిపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న వాటిని మూసివేయాలని చూస్తున్నారు .
![]() |
![]() |