ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఆఖరి లీగ్ మ్యాచ్‌లో భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 రన్స్ చేసింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఓ దశలో 30 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియా.. శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్‌లు రాణించడంతో మోస్తరు స్కోరు చేసింది. శ్రేయస్ అయ్యర్ (79) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత్ బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ మ్యాచ్ తుది జట్టులో భారత్ ఒక మార్పుతో బరిలోకి దిగింది. హర్షిత్ రాణా ప్లేసులో వరుణ్ చక్రవర్తిని తుది జట్టులోకి తీసుకుంది. గ్రూప్-ఏ నుంచి ఇదివరకే భారత్, న్యూజిలాండ్‌లు సెమీస్ చేరాయి. దీంతో ఈ మ్యాచ్ తుది జట్టులో రెండు జట్లూ కూడా మార్పులు చేశాయి.
అయితే ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే గిల్ (2) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికే కెప్టెన్ రోహిత్ శర్మ (15) కూడా పెవిలియన్ చేరాడు. ఈ మ్యాచ్‌తో 300వ వన్డే మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ.. గ్లెన్ ఫిలిప్స్ పట్టిన అద్భుతమైన క్యాచ్‌కు 11 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ అయ్యాడు. దీంతో 30 పరుగులకే భారత్ 3 వికెట్లు కోల్పోయింది.
ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (79), అక్షర్ పటేల్ (42) కలిసి 98 పరుగులు జోడించారు. ఆ తర్వాత వీరిద్దరూ ఔట్ అయినా.. హార్దిక్ పాండ్యా చివర్లో మెరుపులు మెరిపించాడు. 45 బంతుల్లో 45 రన్స్ చేసి.. జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాడు. చివరి ఓవర్‌లో పాండ్యా ఔట్ అయ్యాడు. దీంతో 249/9తో భారత్.. ఇన్నింగ్స్‌ను ముగించింది. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ అత్యధికంగా 5 వికెట్లు తీశాడు. కైల్ జెమీసన్, విలియమ్ ఓరూర్కే, మిచెల్ శాంట్నర్, రచిన్ రవీంద్ర ఒక్కో వికెట్ పడగొట్టారు. కాగా ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు సెమీస్‌లో ఆస్ట్రేలియాతో తలపడుతుంది. ఓడిన జట్టు దక్షిణాఫ్రికాతో మ్యాచ్ ఆడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa