మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని కర్నూలు జిల్లా, కౌతాళం సీఐ అశోక్ కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలలో ముందస్తు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ మహిళలు నేటి సమాజంలో అన్ని రంగాల్లో రాణిస్తూ ముందుకు దూసుపోతున్నారన్నారు. మహిళలపై జరుగుతున్న అరాచకాలను ధైర్యంగా ఎదుర్కొవాలని సూచించారు. ఈ సమావేశంలో పాఠశాల ప్రత్యేకాధికారి పుష్పలత, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa