ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో సెమీఫైనల్లో దక్షిణాఫ్రికాకు న్యూజిలాండ్ 363 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కివీస్ జట్టు 50 ఓవర్లలో 6 వికెట్లకు 362 పరుగులు చేసింది. రచిన్ రవీంద్ర (108), కేన్ విలియమ్సన్ (102) సెంచరీలు చేయగా, డారిల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్ అర్ధ సెంచరీలు చేయలేకపోయారు. ఇద్దరూ తలో 49 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. దక్షిణాఫ్రికా తరపున లుంగి ఎన్గిడి 3 వికెట్లు పడగొట్టాడు. రబాడ 2 వికెట్లు పడగొట్టాడు. వేన్ ముల్డర్ కూడా ఒక వికెట్ పడగొట్టాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa