కార్పొరేట్ పెద్దలు ఉద్యోగుల శ్రమను దోచుకొంటారు.. ఖర్చు తగ్గించుకొంటారు.. లాభార్జన గురించి ఆలోచిస్తారని అనుకుంటాం. ఈయన మాత్రం జీవితాలను మార్చడంలో ముఖ్యంగా మహిళల ఎదుగుదల కోసం నిమగ్నమయ్యారు. తన కంపెనీలో పనిచేసే కార్మికులను గ్రాడ్యుయేట్లుగా, ఉన్నత విద్యా వంతులుగా మార్చుతూ వేలాది మంది జీవితాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారు. ఒకరా ఇద్దరా ఏకంగా ఆయన ఇప్పటి వరకూ 40 వేల మందికిపైగా చదువుకోడానికి ఆయన సాయం చేశారు. అందుకే అందరూ అయనను ‘అప్పా (నాన్న)’ అని పిలుస్తారు. అయనే తమిళనాడుకు చెందిన కేపీ రామస్వామి. కోయంబత్తూరులోని KPR మిల్లుల యజమాని. వృత్తిరీత్యా వస్త్ర పరిశ్రమ నిర్వహిస్తున్నా ఆయన ఎంచుకున్నది మాత్రం తండ్రి పాత్ర. తన మిల్లులో పనిచేసే కార్మికులను గ్రాడ్యుయేట్లుగా తీర్చిదిద్ది... విద్యను వారి మెరుగైన జీవితానికి పునాదిగా మార్చడం ద్వారా తండ్రి పాత్ర పోషిస్తున్నారు. .
తన మిల్లులో పనిచేసే ఓ యువతి అభ్యర్థన రామస్వామి ఆలోచనను మార్చేసింది. ‘అప్పా నాకు చదువంటే ఇష్టం... కానీ పేదరికం వల్ల నా తల్లిదండ్రులు న్ను బడి మాన్పించి ఇక్కడికి పంపారు.. కానీ నేను ఇంకా చదువుకోవాలనుకుంటున్నాను.. సాయం చేస్తారా?’ అని అభ్యర్ధించింది. ఆమె ఆవేదన ఆయన మనసును కదిలించింది. తన కార్మికులకు కేవలం జీతం ఇవ్వడమే కాదు.. వారికి ఉన్న భవిష్యత్తును ఇవ్వాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. తమ మిల్లు లోపలే విద్యా వ్యవస్థను ఏర్పాటు చేసి.. 8 గంటల షిఫ్ట్ పూర్తయిన తర్వాత కార్మికులకు 4 గంటల చదువుకునేందుకు అవకాశం కల్పించారు.
పూర్తిస్థఆయిలో తరగతి గదులు, ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్, యోగా కోర్సులను ప్రారంభించి.. నిధులు సమకూర్చారు 1998లో మొదలైన ఈ విద్యాదానం ద్వారా ఇప్పటి వరకు 24,536 మంది మహిళలు పది, ఇంటర్, UG, పీజీ డిగ్రీలు పొందారు. పదివేల మంది గ్రాడ్యుయేట్ల అయ్యారు. అలా చదువుకున్న చాలా మంది ఇప్పుడు నర్సులు, టీచర్లు, పోలీసు అధికారులుగా, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా ఉద్యోగం చేస్తున్నారు. ఈ ఏడాది తమిళనాడు ఓపెన్ యూనివర్సిటీ నుంచి 20 మంది గోల్డ్ మెడల్ అందుకున్నారు.
అయితే, తన కంపెనీలో పనిచేసే కార్మికులు చదువుకుని వెళ్లిపోతే ఎలా అనే సందేహం రావచ్చు. దీనికి ఆయన చెప్పేది ఏంటంటే ‘‘నేను వారి సామర్థ్యాన్ని వృథా చేస్తూ మిల్లులోనే కార్మికులుగా ఉంచాలనుకోవడం లేదు.. ఇది వాళ్లు ఎంచుకున్నది కాదు.. పేదరికం కారణంగా వచ్చారు. వారికి భవిష్యత్తును ఇవ్వడం నా పని, ఇది పంజరం కాదు అని’’ అయన అంటారు. తమ మిల్లులో పనిచేస్తూ చదువుకుని బయటకు వెళ్లి కెరీర్ నిర్మించుకుంటారని, ఆ తర్వాత? వారి గ్రామాల నుంచి మరింత మంది ఆడపిల్లలను మిల్లుకు పంపుతారనఅ ంటున్నారు.
ఈరోడ్ జిల్లా కలియంపుత్తూరు అనే కుగ్రామంలో ఓ సాధారణ వ్యవసాయం కుటుంబంలో పుట్టిన రామస్వామి.. నలుగురు సంతానంలో పెద్దవాడు. చదివించే స్థోమత లేక తల్లిదండ్రులు ఆయన్ను వ్యవసాయ పనులకు పంపారు. పొలం పనులు చూసుకుంటూ ముగ్గురు తమ్ముళ్లను ప్రయోజకుల్ని చేశారు. క్రమంగా వ్యవసాయంలో నష్టాలు పెరగడంతో దాన్ని వదిలేశారు. అనంతరం రూ.8 వేలు అప్పుచేసి.. 1971లో తన రెండో తమ్ముడితో కలిసి నాలుగు స్పిన్సింగ్ మెషిన్లతో చిన్నగా వ్యాపారం మొదలుపెట్టారు.
రోజులో 20 గంటల పనిచేస్తూ.. మూడేళ్లకే లాభాల్లోకి తీసుకొచ్చారు. తన తమ్ముళ్ల సహకారంతో వ్యాపారాన్ని విస్తరించి.. 1984లో కేపీఆర్ మిల్ సంస్థను స్తాపించారు. ఇక, అక్కడ నుంచి ఆయన వెనుదిరిగి చూడలేదు. విదేశాలకు ఫ్యాబ్రిక్ ఎగుమతి చేస్తూ దినదిన ప్రవర్థమానంలా అభివృద్ధి చెందింది. 1994లో భారీ పరిశ్రమను నెలకొల్పి.. ప్రస్తుతం నాలుగు ఫ్యాక్టర్లీలను నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది ఏకంగా రూ.30 వేల కోట్ల టర్నోవర్ సాధించింది. భారత్‌లోని టాప్ 500 లాభదాయక కంపెనీల్లో ఒకటిగా ఫార్చ్యూన్ జాబితాలో ఒకటిగా చేరింది.
1997లో కేపీఆర్ మిల్స్‌లో కార్మికులు సమ్మె బాటపట్టడంతో ఆ సమయంలో మహిళలు అండగా నిలిచారు. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువతలను.. ఇళ్లలో వెట్టిచాకిరీ చేస్తున్నవారిని పనిలోకి తీసుకున్నారు. తన కంపెనీలో పనిచేసే అమ్మాయిలకు భోజనం, హాస్టల్ వసతి ఏర్పాటుచేసి అన్ని రకాలుగా భద్రత కల్పించారు. ఆ మరుసటి ఏడాదే కంపెనీలో కార్మికురాలిగా చేరిన యువతి.. ఆయన దగ్గరకు వచ్చి నాకు చదువంటే ఇష్టం... కానీ పేదరికం వల్ల అమ్మానాన్నలు పనిలో చేర్చించారని చెప్పడంతో... నాకు సాయం చేయాలని అడగడంతో ఆమె ఒక్కరికే కాదు తన కంపెనీలోని 400 మంది మహిళలకు చదువు చెప్పించాలని కేపీ రామస్వామి నిర్ణయించారు. అప్పుడు మొదలైన విద్యాదానం నిరాటకంగా కొనసాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa