భారత జట్టు స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ కొత్త హెయిర్ స్టైల్ తాలూకు ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో ఎనిమిది రోజుల్లో ఐపీఎల్ 18వ సీజన్ ప్రారంభం కానుండగా, రన్‌మెషీన్ నయా హెయిర్ స్టైల్ తో దర్శనమిచ్చాడు. కోహ్లీ కొత్త లుక్‌కు సంబంధించిన ఫొటోలను హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫొటోలకు ఆయన 'ది గోట్ ఎనర్జీ' అని క్యాప్షన్ ఇచ్చారు. "వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ కోసం కొత్త స్నిప్. రేజర్ షార్ప్ గా కనిపిస్తోంది" అని ఆలీమ్ ఖాన్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. ఇప్పుడు కోహ్లీ నయా లుక్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండగా నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.
![]() |
![]() |