తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు నేడు ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబును ఆహ్వానించారు. రేపు (మార్చి 15) అమరావతిలోని వెంకటపాలెంలో జరగనున్న శ్రీనివాస కల్యాణం కార్యక్రమానికి రావాలంటూ సీఎంను ఆహ్వానించారు. ఈ మేరకు ఆయనకు ఆహ్వాన పత్రిక అందజేశారు. అంతేగాకుండా, సీఎం చంద్రబాబుకు స్వామివారి ప్రసాదం అందజేశారు. వెంకటపాలెంలో నిర్వహిస్తున్న శ్రీనివాస కల్యాణం ఏర్పాట్ల గురించి బీఆర్ నాయుడు సీఎం చంద్రబాబుకు వివరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చైర్మన్ బీఆర్ నాయుడుకు, టీటీడీ బోర్డు సభ్యులకు సూచించారు. Ppకాగా, చంద్రబాబును కలిసిన వారిలో టీటీడీ పాలకమండలి సభ్యులు, టీటీడీ ఈవో, జేఈవో కూడా ఉన్నారు.
![]() |
![]() |